హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయరాదని, వినియోగదారుల హక్కులను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ జారీ చేసిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు. వినియోగదారుల ఇష్ట ప్రకారమే చెల్లింపు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
2024లో కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీ వసూలుకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ నిబంధనలపై నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కేంద్రం కోరిందని, నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బిల్లింగ్‌లో పారదర్శకత అవసరం











