ఆర్మూర్, 2026-08-14
దేశ స్వాతంత్ర్యం అనంతరం కేవలం ఉత్తరాలు, టెలిగ్రాఫ్ సేవలకు పరిమితమైన భారత తపాలా శాఖ, నేడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగానికి గట్టి పోటీనిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించేందుకు అనేక మార్పులు చేపట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశ స్వాతంత్ర్యం అనంతరం తంతి, తపాలా శాఖ మాత్రమే వ్యవస్థలో ఉండేది. తంతి అంటే టెలిగ్రాఫ్, తపాలా అంటే ఉత్తరాలు బంధువులకు పంపడం, వచ్చిన ఉత్తరాలు తీసుకోవడం మాత్రమే జరిగేది. నేడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత తపాలా కార్యాలయాల వ్యవస్థను సమూలంగా మార్చి, బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక లావాదేవీలకు పోటీగా నిలబెట్టడానికి గల కారణాలను శుక్రవారం మా ప్రతినిధి ఆర్మూర్ డివిజనల్ తపాలా శాఖ అధికారి బి. కిషన్ నాయక్‌ను వివరణ కోరగా, గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం భారత ప్రభుత్వ తపాలా శాఖ పెను మార్పులు తీసుకువచ్చిందని, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయిలో ఉన్న కార్పొరేట్ బ్యాంకులతో పోటీ పడుతుందని అన్నారు.










