పాల సహకార సంఘాలలో సభ్యులు కాని పాల ఉత్పత్తిదారులు మరియు పాల విక్రేతలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ పొందాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆదేశించింది. ఆహార వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలంటే ఈ నిబంధన తప్పనిసరి అని స్పష్టం చేసింది.
కొంతమంది పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఈ నేపథ్యంలో, ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అన్ని పాల వ్యాపారాలు తప్పనిసరిగా FSSAI వద్ద నమోదు చేసుకోవాలని లేదా లైసెన్స్ పొందాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.











