రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి వద్ద, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ విస్తరణ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని భావిస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైందని, దానికి రాయలసీమ కేంద్రమైందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్, త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థలను ఆయన అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జొన్నగిరి ప్రాంతానికి సువర్ణగిరిగా చారిత్రక నేపథ్యం ఉందని, అశోకుడి కాలం నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ, రాయలసీమను రతనాల సీమగా అభివర్ణించారు. కాలక్రమేణా ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తినా, ప్రాజెక్టులు, సాగునీటితో సీమకు జీవం పోశామని, ఇప్పుడు గోల్డ్ మైనింగ్ తో పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.











