భారతదేశంలో విలాసవంతమైన హోటళ్ల రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన లీలా హోటల్స్ సామ్రాజ్యాన్ని నాయర్ కుటుంబం విక్రయించింది. భారీ అప్పులు, వడ్డీ భారం, నిర్మాణ వ్యయం పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవస్థాపకుడు కెప్టెన్ సీపీ కృష్ణన్ నాయర్ కుమారుడు దినేష్ నాయర్ వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ హోటల్ ప్రాజెక్టు ఆర్థికంగా భారంగా మారిందని తెలిపారు.
భారతదేశంలో విలాసవంతమైన హోటళ్ల రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీలా హోటల్స్ సామ్రాజ్యం ఒకప్పుడు నాయర్ కుటుంబం ఆధీనంలో ఉండేది. అయితే, భారీ అప్పులు, రుణాలపై వడ్డీ భారం, కొన్ని హోటల్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగడం వంటి కారణాలతో ఆ కుటుంబం తన హోటల్ వ్యాపారంలో ఎక్కువ భాగాన్ని 2019లో కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ సంస్థకు విక్రయించింది. తాజాగా, వ్యవస్థాపకుడు కెప్టెన్ సీపీ కృష్ణన్ నాయర్ కుమారుడు దినేష్ నాయర్ ఈ విక్రయానికి దారితీసిన ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఢిల్లీ హోటల్ ప్రాజెక్టుతో పెరిగిన ఆర్థిక భారం
దినేష్ నాయర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో లీలా హోటల్ నిర్మాణం కుటుంబానికి భారీ ఆర్థిక భారంగా మారింది. ఈ ఒక్క ప్రాజెక్టు కారణంగా వ్యాపారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొందని ఆయన తెలిపారు. ఢిల్లీ హోటల్ కోసం భూమి కొనుగోలుకే సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణం, ఇతర వ్యయాలు, రుణాలపై వడ్డీ కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.2,100 కోట్లకు చేరింది. ఇందులో వడ్డీ రూపంలోనే దాదాపు రూ.700800 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని దినేష్ నాయర్ వెల్లడించారు.












