నంద్యాల, జూలై 2
నంద్యాల పట్టణంలోని 3, 25 వార్డులలో టీడీపీ ఆధ్వర్యంలో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వీటిని ప్రారంభించి, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సూచించారు.
నంద్యాల పట్టణంలోని 3 వ వార్డు నడిగడ్డ మరియు 25 వ వార్డు సాయిబాబా నగర్ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై, హెల్ప్ డెస్క్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ "ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటిదని ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే శక్తి ఓటుకు మాత్రమే ఉందని " అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ పేరును నమోదు చేసుకుని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముఖ్యంగా పట్టణ శివార్లలో నివసించే పేదలు, నిరక్షరాస్యులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు, వారికి తోడ్పాటును అందించేందుకు ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. వార్డు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.











