యూరప్ ఆటోమొబైల్ మార్కెట్లో చైనా కార్ల తయారీ సంస్థలు తమ పట్టును పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. చైనాలో పెరుగుతున్న పోటీ, యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధిస్తున్న దిగుమతి సుంకాలు వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. చైనా నుంచి పూర్తిగా తయారైన కార్లను యూరప్‌కు ఎగుమతి చేయడానికే పరిమితం కాకుండా, అక్కడే వాహనాలను తయారు చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి.
యూరప్ ఆటోమొబైల్ మార్కెట్లో చైనా కార్ల తయారీ సంస్థలు తమ పట్టును పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. చైనాలో పెరుగుతున్న పోటీ, దేశీయంగా కార్ల విక్రయాలపై ఒత్తిడి, యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధిస్తున్న దిగుమతి సుంకాలు వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. చైనా నుంచి పూర్తిగా తయారైన కార్లను యూరప్‌కు ఎగుమతి చేయడానికే పరిమితం కాకుండా, అక్కడే వాహనాలను తయారు చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యూరప్‌లోనే తయారీకి ప్రాధాన్యం
చైనాకు చెందిన బీవైడీ, చెరీ, గీలీ వంటి సంస్థలు యూరప్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదా ఇప్పటికే ఉన్న కర్మాగారాలను వినియోగించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. హంగరీ, స్పెయిన్ వంటి దేశాలు ఈ విస్తరణలో కీలకంగా మారుతున్నాయి. స్థానికంగా కార్ల తయారీ చేపట్టడం ద్వారా దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, ప్రాంతీయ విడిభాగాల సరఫరాదారులతో సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.












