నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 3వ వార్డు మెంబర్ సబ్బిడి మొగులవ్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సబ్బిడి రమేష్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. దొరల పెత్తనాన్ని అణచివేసిన ధైర్యశాలి, చాకలి కులంలో పుట్టి చరిత్ర లిఖించిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విసునూరు గడీకి వణుకు పుట్టించిన ధీరవనిత, తెలంగాణ పోరాటానికి తొలి తూటా ఆమె అని కొనియాడారు. ఆడబిడ్డలకు ఆత్మగౌరవ పాఠం నేర్పిన గురువు, పేదల బతుకుల్లో వెలుగు నింపిన దీపం చాకలి ఐలమ్మ అని ప్రశంసించారు.












