విధి నిర్వహణలో మరణించిన, పదవీ విరమణ పొందిన మున్సిపల్ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) కడప నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం యూనియన్ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను కలిసి వినతిపత్రం అందజేశారు.
కడప ఆర్ అండ్ బీ అతిథి గృహం జరిగిన ఈ సమావేశంలో, మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన, రిటైరైన కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీనిపై మంత్రి ఎస్. సవిత సానుకూలంగా స్పందిస్తూ, ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే, మరణించిన వారి కుటుంబాల్లో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్న విషయాన్ని నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.












