కామారెడ్డిలో విశ్వజ్ఞ బ్రహ్మ స్వర్ణ సంఘం నూతన అధ్యక్షుడిగా చేపూరి వెంకటస్వామి చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విశ్వజ్ఞ బ్రహ్మ స్వర్ణ సంఘం అధ్యక్షులుగా చేపూరి వెంకటస్వామి చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు స్వర్ణకార సంఘం, పట్టణ స్వర్ణకార సంఘం, సువర్ణ కళాకారుల సంఘం, యువజన సంఘం సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తన వంతుగా సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, సభ్యులందరి సహకారం కోరారు. నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఉపేష్ చారి, కోశాధికారిగా పిర్కోజి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులుగా కనకంటి వంగల దుర్గాప్రసాచారిలను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సంఘం సభ్యులందరూ పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో విశ్వజ్ఞ బ్రహ్మ స్వర్ణ సంఘం శాశ్వత గౌరవ అధ్యక్షులు ఉగ్రవాయి రాఘవుల చారి, శాశ్వత గౌరవ సలహాదారులు వంగాల శ్రీనివాస్ చారి, గౌరవ సలహాదారులు వంగాల పుండరీక చారి, కె లక్ష్మయ్య, వంగాల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడికి, కార్యవర్గానికి వారు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











