ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని హంగర్గ గ్రామానికి చెందిన డాక్టర్ ఆనందరావు వాఘ్మారే చేతల్లో చూపించారు. ఇటీవల ఇసుక ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన బస్వాపూర్ గ్రామానికి చెందిన జలయ్య కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.
కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్, ఎంఎస్ వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆనందరావు వాఘ్మారే, వైద్య వృత్తితో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తిస్తూ బాధిత కుటుంబానికి తన వంతు సహాయం అందించడం పలువురి ప్రశంసలు అందుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇతరుల కష్టాలను చూసి స్పందించి, అవసరమైన సమయంలో సహాయం చేయాలనే ఆయన తపన పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎడ్గి గ్రామ సర్పంచ్ అస్పత్వర్ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ వినోద్, డాక్టర్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు.












