మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చేపల మార్కెట్ ప్రాంతంలో ప్రజలు ఆకస్మికంగా మృతి చెందుతున్న ఘటనలపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, స్థానిక సమస్యలను తెలుసుకుని ప్రజలకు భరోసా కల్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 1: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చేపల మార్కెట్ ప్రాంతంలో గత కొంతకాలంగా ప్రజలు ఆకస్మికంగా మృతి చెందుతున్న ఘటనలపై స్పందించిన పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ, చేపల మార్కెట్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. స్థానిక పరిస్థితులను తెలుసుకుని, ప్రజలకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ నాయకులకు ఆయన ఫోన్ ద్వారా సూచించారు.












