బాల్కొండ, 2026-06-05
బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఇస్మాయిల్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఆదివారం రాత్రి రోడ్డు పక్కన కనిపించిన విలువైన చరవాణిని ఆయన సోమవారం బాల్కొండ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఇస్మాయిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆర్మూర్ నుండి బాల్కొండకు వస్తున్న ఆయన, చిట్టాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆటోలోని ప్రయాణికులను దించుతున్న సమయంలో రోడ్డు పక్కన ఒక చరవాణి కనిపించింది. వెంటనే ఆ చరవాణిని తీసుకున్న ఇస్మాయిల్, సోమవారం ఉదయం బాల్కొండ పోలీస్ స్టేషన్లో దానిని అప్పగించారు.









