సిద్దవటం (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 09
మండలం వంతాటిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్.ఐ. హారిక గ్రామంలో బస చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలు, వినాయక చవితి పండుగ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వంతాటి పల్లిలో "పల్లె నిద్ర" ఎస్.ఐ. హారిక జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఎస్.ఐ. హారిక మండలం వంతాటి పల్లి గ్రామంలో బుధవారం రాత్రి “పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రాత్రి బస చేసి స్థానిక ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అక్రమ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు. అలాగే రాబోయే వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, వివాదాలు చోటుచేసుకోకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్.ఐ హారిక కోరారు. ప్రజలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, గ్రామంలో ఎలాంటి సమస్యలు లేదా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు.












