దశమహావిద్యలలో ఒకటైన ధూమావతి దేవి, జీవితంలోని కఠినమైన నిజాలను, శూన్యత, వైరాగ్యం, నష్టం, అస్థిరత వంటి లోతైన భావనలను అర్థం చేసుకోవడంలో మార్గనిర్దేశం చేస్తుంది. జీవితం ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండదని, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని ఆమె తత్వం గుర్తుచేస్తుంది.
దక్షిణ్ న్యూస్ ఈ-పేపర్ వీక్షకులకు నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలి. కాలమహిమ శుభోదయం. 293వ పరిష్కారం. దశమహావిద్యల రహస్యాలు - ఎపిసోడ్ 7. ధూమావతి: జీవితంలోని కఠినమైన నిజాలను ఎదుర్కొనే జ్ఞానం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కాలమహిమ కుటుంబ సభ్యులకు నమస్తే జీవితంలో కొన్ని దశలు మనల్ని లోపల నుంచి కదిలిస్తాయి. ఒకప్పుడు మనతో ఉన్నవారు దూరమవుతారు. మనం ఎంతో ఆశించినది చేజారిపోతుంది. ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి. కష్టకాలంలో మనకు తోడుగా ఉంటారనుకున్నవారు కనిపించరు. అన్నీ బాగానే ఉన్నట్లు బయట కనిపించినా, లోపల మాత్రం ఒంటరితనం వెంటాడుతుంది.











