కామారెడ్డి పట్టణంలో ఆర్ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ ధనవంతరి జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శ్రీ ధనవంతరి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆరోగ్య, ఔషధ నియంత్రణ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
గత 33 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాలో కీర్తిశేషులు పోలీస్ రాజేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం , శుక్రవారం ఉదయం 11 గంటలకు, ఆశ్విజ బహుళ త్రయోదశి నాడు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శ్రీ ధనవంతరి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆరోగ్య అధికారి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే కామారెడ్డి టౌన్ సిఐ, కామారెడ్డి ఎస్ఐ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం భోజన సౌకర్యం కూడా కల్పించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ మానేటి, జిల్లా సంఘ కార్యదర్శి లింగంపల్లి దేవయ్య, అధికార ప్రతినిధి సిహెచ్ రాజయ్య, కామారెడ్డి టౌన్ ఇన్చార్జి ఎంబ ప్రకాష్, శ్రీనివాస్, పాండురంగం మరియు భూమయ్యలు పాల్గొన్నారు. వారు కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











