చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, దేవాలయాల స్వయంప్రతిపత్తి ఉద్యమకారుడు డాక్టర్ ఎం.వి. సౌందర్ రాజన్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి ఆధ్యాత్మిక రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌందర్ రాజన్, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసులోనూ ఆలయ ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన చూపిన అంకితభావం ప్రశంసనీయం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయాల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, దేవుడు వ్యాపార వస్తువు కాకూడదని సౌందర్ రాజన్ గట్టిగా విశ్వసించారు. ఈ క్రమంలోనే 1998లో చిలుకూరు ఆలయంలో హుండీని తొలగించి, ప్రభుత్వ జోక్యాన్ని ఎదిరించి సంచలనం సృష్టించారు.












