హైదరాబాద్, జూన్ 28
పవిత్రమైన ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను ప్రముఖులు సన్మానించారు. నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ బాషా సిద్ధికి, టిడిపి యువ నాయకులు అజీజ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
పవిత్రమైన ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని, హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ బాషా సిద్ధికి, చాబోలు టిడిపి యువ నాయకులు అజీజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ను సాదరంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారిద్దరూ మంత్రి ఫరూక్‌కు ఉమ్రా యాత్ర విజయవంతమైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.












