తిరుమల శ్రీవారి కళ్యాణం సందర్భంగా పంపిణీ చేసిన లడ్డూల నాణ్యతపై బీజేపీ నాయకురాలు, నటి మధులత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. లడ్డూల రుచి, తయారీ విధానంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమల నుండి నిన్న అందిన శ్రీవారి కళ్యాణ లడ్డూలు ఆశించిన స్థాయిలో లేవని మధులత పేర్కొన్నారు. లడ్డూలు చాలా గట్టిగా, అధిక చక్కెరతో, నెయ్యి తక్కువగా ఉన్నాయని, పచ్చ కర్పూరం, యాలకులు, డ్రై ఫ్రూట్స్ వంటివి తప్ప అసలు రుచి లోపించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇంతటి గొప్ప ఆలయానికి చెందిన ప్రసాదం నాణ్యత విషయంలో ఇలా ఉండటం తన దురదృష్టమని ఆమె అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి నాణ్యత లోపాన్ని చూడలేదని, తినలేదని ఆమె తెలిపారు.










