సాధారణంగా ఫ్యాషన్ షోలు అంటే ఖరీదైన దుస్తులు, విలాసవంతమైన వేదికలు గుర్తుకొస్తాయి. కానీ మహారాష్ట్రలోని వసాయ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ వినూత్న ఫ్యాషన్ షో నిర్వహించారు. కూరగాయల మార్కెట్‌నే ర్యాంప్‌గా మార్చి మోడల్స్ క్యాట్‌వాక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వినూత్న కార్యక్రమంలో మోడల్స్ ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు, ఆభరణాలకు బదులుగా ముల్లంగి, క్యారెట్లు, కొత్తిమీర వంటి కూరగాయలను చేతబట్టి ర్యాంప్‌పై నడిచారు. చుట్టూ కూరగాయల దుకాణాలు, వ్యాపారులు, కొనుగోలుదారులు ఉండగా ఈ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమానికి పహాడీ పాటను నేపథ్య సంగీతంగా ఉపయోగించడం మరో విశేషం. సాధారణ మార్కెట్ వాతావరణంలో మోడల్స్ వినూత్నంగా క్యాట్‌వాక్ చేయడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.












