బాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కిన రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణ చిత్రానికి బాంబే హైకోర్టు నుంచి ప్రత్యేక రక్షణ లభించింది. సినిమాను అక్రమంగా రికార్డు చేయడం, కాపీలు తయారు చేయడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడం లేదా అనధికారికంగా ప్రసారం చేయడాన్ని అడ్డుకుంటూ కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో సినిమా పైరసీకి గురికాకుండా నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోర్టు ఆదేశాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అనుమతి లేకుండా సినిమాను రికార్డు చేయడం, ప్రసారం చేయడం, ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం వంటి చర్యలకు పాల్పడకూడదు. సినిమా హక్కులకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ ఆదేశాల ఉద్దేశం.












