సినిమా, 26 ఏప్రిల్ 2026
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, హాలీవుడ్లో తెరకెక్కిన పాప్ సంగీత దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితకథ ఆధారిత చిత్రం మైఖేల్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల నిర్వహించిన రెడిట్ ఆస్క్ మీ ఎనీథింగ్ () సెషన్లో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మైఖేల్ సినిమా తనకు ఎంతో నచ్చిందని, మైఖేల్ జాక్సన్ పాటలు వింటూనే తాను పెరిగానని సచిన్ తెలిపారు. ఆయన సంగీతాన్ని మించినది మరొకటి లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సచిన్ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.












