పోతంగల్–కురుద్ (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 03
గత వారం కురిసిన భారీ వర్షాలకు పోతంగల్కురుద్ గ్రామాల మధ్యనున్న వాగు బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున చెట్లు, కొమ్మలు, వేర్లు కొట్టుకువచ్చి పేరుకుపోయాయి. దీంతో వాగులో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

స్థానికుల ఆందోళన
ప్రస్తుతం బ్రిడ్జి పక్కనే చెట్ల దిబ్బలు పేరుకుపోవడంతో మరోసారి భారీ వర్షాలు కురిస్తే నీటి ప్రవాహం నిలిచిపోయి వరద నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం రైతులు, గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుండటం తో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
అధికారులకు విజ్ఞప్తి
సంబంధిత నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్ అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన చెట్లు, కొమ్మలను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.