తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. కాకులమాను అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటల కారణంగా సుమారు ఎకరా అటవీ భూమి కాలిపోయినట్లు సమాచారం.
శుక్రవారం మధ్యాహ్నం తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలోని కాకులమాను వద్ద ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ లైన్ నుంచి వెలువడిన నిప్పు రవ్వల వల్ల మంటలు చెలరేగి, గాలికి వేగంగా వ్యాపించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాద సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశారు.












