రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు తండ్రి చమర్తి సుబ్బరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.
చమర్తి జగన్మోహన్ రాజు, చమర్తి విజయ్ మోహన్ రాజు హుటాహుటిన స్పందించి ఆయనను తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.












