నంద్యాల, జూన్ 30
పేద ప్రజలకు అండగా నిలవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసుకు నిదర్శనమని ఏపీ న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముగ్గురికి రూ. 5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు.
పేద ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు 'నేనున్నాను' అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ముగ్గురికి 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేదా ఆరోగ్య పరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావల్సిన డబ్బులు లేకపోవడం, వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు తనకు విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారన్నారు.
అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముగ్గురికి వచ్చిన 5 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.












