కర్నూలు, జూన్ 30
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి మంగళవారం పదవీ విరమణ పొందిన ఎస్. నూర్జహాన్ గారిని, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ గారు సన్మానించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ గారి సేవలను డీఐజీ ప్రవీణ్ కొనియాడారు.
పదవీ విరమణ అనంతరం కూడా ఏ సమస్య ఉన్నా నేరుగా సంప్రదించవచ్చని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ గారు తెలిపారు. కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన ఎస్. నూర్జహాన్ గారు మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా డీఐజీ కార్యాలయంలో ఆమెను శాలువాతో సన్మానించి, బహుమతి అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా డీఐజీ గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎస్. నూర్జహాన్ గారు అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా ఏవైనా సమస్యలు ఎదురైతే ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా వచ్చి తనను కలవవచ్చని భరోసా ఇచ్చారు. కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ గారి మేనేజర్ రత్నా ప్రకాష్, సీఐ (లైజనింగ్ ఆఫీసర్) తిక్కస్వామి, డీఐజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.












