ఆళ్లగడ్డ/నంద్యాల జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూన్ 30
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కమిటీల నియామకానికి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని కమిటీల నియామకం కొరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. సేవాభావంతో పార్టీ బలోపేతానికి పనిచేయాలనుకునే కార్యకర్తలు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 3/7/2026 వ తేది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆళ్లగడ్డ జనసేన పార్టీ ఆఫీస్ ఇరిగేలబ్రదర్స్ వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల ప్రక్రియ కార్యక్రమం సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ పరిశీలకులు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి విచ్చేయుచున్నారు. కావున గ్రామ కమిటీల యందు పార్టీ కొరకు పనిచేయుటకు ఆసక్తి కలవారు ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు, జనసేన సభ్యత్వ ఐడి కార్డు నెంబర్ తీసుకొని సమావేశంలో హాజరుకావాలని ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ ఇంచార్జ్ ఇరిగేల రామ పుల్లారెడ్డి తెలిపారు. జనసేన పార్టీ తాలూకా అధికార ప్రతినిధి ఇరిగేల సూర్యనారాయణ రెడ్డి తెలిపారు, కావున జనసేన సాధకులు, వీర మహిళలు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.











