యాభై ఏళ్లు దాటిన మహిళల్లో తరచుగా వినిపించే 'మతిమరుపు', 'అలసట' వంటి లక్షణాలకు మెనోపాజ్ ప్రధాన కారణం కావచ్చు. ఈ దశలో ఎదురయ్యే అనేక శారీరక, మానసిక ఇబ్బందులపై అవగాహన అవసరం.
చాలామంది మహిళలు మెనోపాజ్ను ఒక సాధారణ మార్పుగా భావించి, దానితో పాటు వచ్చే సమస్యలను విస్మరిస్తుంటారు. అయితే, వేడి ఆవిర్లు, కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి వంటివి వారి జీవిత నాణ్యతను తగ్గిస్తాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ లక్షణాల తీవ్రత వ్యక్తిని బట్టి మారుతుంది. కొందరికి స్వల్పంగా ఉంటే, మరికొందరికి తీవ్రంగా ఉంటాయి. వృత్తిపరమైన, సామాజిక జీవితాల్లో కూడా ఈ మార్పులు ప్రభావం చూపుతాయి.






