అమెరికాలోని నైరుతి ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అరిజోనా, కొలరాడో రాష్ట్రాల్లో వరద ముప్పు పెరగడంతో అధికారులు ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అరిజోనా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతమైన సెడోనాలో ఓక్ క్రీక్ నది నీటిమట్టం వేగంగా పెరిగింది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక, అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని ఇళ్లకు చేరుకున్న వరద నీటితో వాహనాలు సైతం నీట మునిగాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇతర ప్రాంతాల్లోనూ హెచ్చరికలు
క్యాంప్ వెర్డే, గిలా కౌంటీ ప్రాంతాల్లోనూ వరద హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులను మూసివేశారు. వాహనదారులు వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరించారు.












