భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ () చేపట్టిన ఆదిత్య 1 మిషన్, సూర్యుడి నుంచి వెలువడే సౌర విస్ఫోటనాల () విస్తరణపై కీలక సమాచారాన్ని అందించింది. భారత శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధన, సౌర విస్ఫోటనాల ఆకారం మరియు కదలికలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ ఫలితాలు అంతరిక్ష వాతావరణ అంచనాలకు ఒక ముఖ్యమైన పురోగతిగా పరిగణించబడుతున్నాయి.
భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలనా కేంద్రం ఆదిత్య 1, సూర్యుడి వెలుపలి వాతావరణం నుంచి వెలువడే భారీ అయస్కాంత ప్లాస్మా విస్ఫోటనాలు ( ) ఎలా విస్తరిస్తాయనే అంశంపై భారత శాస్త్రవేత్తలు కొత్త విషయాలను గుర్తించారు. ఈ పరిశోధనతో సౌర విస్ఫోటనాల ఆకారం, కదలికలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారతీయ ఖగోళ భౌతిక పరిశోధనా సంస్థ (), బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు ఆదిత్య 1లోని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ () పరికరం నుంచి వచ్చిన సమాచారాన్ని ఉపయోగించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ () చిత్రాలు, త్రీడీ నమూనాలను కూడా కలిపి పరిశీలించారు.












