ప్రపంచవ్యాప్తంగా 2026 నుంచి 2030 మధ్యకాలంలో అవసరమైన పెట్టుబడులకు, అందుబాటులో ఉండే నిధులకు మధ్య భారీ అంతరం ఏర్పడే అవకాశం ఉందని స్పెయిన్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ శాంటాండర్ నివేదిక వెల్లడించింది. ఈ లోటు సుమారు 30 ట్రిలియన్ యూరోలు (33.6 ట్రిలియన్ డాలర్లు) ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.
2030 నాటికి ప్రపంచానికి మొత్తం 50 ట్రిలియన్ యూరోల మేర పెట్టుబడులు అవసరమవుతాయని, అయితే అందులో దాదాపు 30 ట్రిలియన్ యూరోల నిధుల సమకూర్పులో లోటు ఏర్పడవచ్చని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెట్టుబడి అంతరానికి కారణాలు
ఈ పెట్టుబడి అంతరానికి ప్రధాన కారణం ఇంధన రంగంలో వస్తున్న మార్పులేనని నివేదిక వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్ గ్రిడ్ల విస్తరణ, ఇంధన నిల్వ వ్యవస్థలు, విద్యుదీకరణ వంటి కార్యక్రమాలకు భారీగా నిధులు అవసరమవుతాయని నివేదిక తెలిపింది. ఈ రంగాల్లోనే సుమారు 22 నుంచి 26 ట్రిలియన్ యూరోల పెట్టుబడి లోటు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.












