కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా ఆయురారోగ్యాలతో, శక్తిసామర్థ్యాలతో దీర్ఘకాలం జీవించాలని, దేశానికి అంకితభావంతో సేవలందిస్తూ, భారతదేశ అభివృద్ధిలో మరింత కాలం భాగస్వామిగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
దేశ భద్రత, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అమిత్ షా మరిన్ని సంవత్సరాలు సేవలందించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆరోగ్యం, మానసిక స్థైర్యం, శక్తి ఆయనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సురక్షితమైన, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణమే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఆ లక్ష్య సాధనకు అమిత్ షా తన సేవలను కొనసాగించాలని పేర్కొన్నారు.












