ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ రాంపూర్ జిల్లా జైలులో ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్‌ను కలవనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులను కూడా ఆయన కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆజం ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ఆయన భార్య తంజీన్ ఫాతిమా నుంచి సమాచారం అందడంతో అఖిలేశ్ యాదవ్ రాంపూర్‌కు వెళ్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత ఫఖ్రుల్ హసన్ చంద్ తెలిపారు. జైలులో ఆజం ఖాన్‌ను కలిసిన అనంతరం ఆయన నివాసానికి వెళ్లి భార్య, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆజం ఖాన్ రాంపూర్ సదర్ నియోజకవర్గం నుంచి పదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముఖ్య నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అయితే, నకిలీ పాన్ కార్డుల కేసులో కోర్టు విధించిన శిక్ష నేపథ్యంలో 2020 నుంచి ఆయన రాంపూర్ జిల్లా జైలులో ఉన్నారు.












