దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు, వినియోగంపై సుప్రీంకోర్టు పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్‌ను , 5, 6 తేదీల్లో మాత్రమే విక్రయించేందుకు అవకాశం కల్పించారు. తేదీల్లో నిర్ణీత సమయాల్లో మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉంటుంది.
ఉత్తర ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిహారిక భట్ ఈ మార్గదర్శకాలను వెల్లడించారు. గ్రీన్ క్రాకర్స్ పేరుతో విక్రయించే ప్రతి పెట్టెపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఆ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తయారీదారు వివరాలు, ధ్రువీకరణ, బ్యాచ్ నంబర్ వంటి సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చని వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చాలి. ఇతర సమయాల్లో బాణసంచా వినియోగానికి అనుమతి ఉండదు. నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్లో బాణసంచాపై గతంలో అమల్లో ఉన్న పూర్తి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుంది.












