దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ () ప్రక్రియపై వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు కనిపించని వారు ఫారం-6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, తప్పుడు ప్రకటన కేసుల భయం అవసరం లేదని తెలిపింది.
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు కనిపించని వారు ఫారం-6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ప్రక్రియలో తప్పుడు ప్రకటన చేశామనే కేసులు నమోదవుతాయన్న భయాలు అవసరం లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో ఓటర్ల జాబితాలో పేరున్నప్పటికీ ముసాయిదా జాబితాలో పేరు కనిపించని వారు ఫారం-6 ద్వారా మళ్లీ పేరు నమోదు చేసుకోవచ్చు. తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకుంటున్నట్లు ప్రకటించాల్సి వస్తుందనే సందేహాలు కొందరిలో వ్యక్తమయ్యాయి. అయితే అలాంటి భయాలు అనవసరమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.












