తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మోకాలిమిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన చిరుత కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో ఇదే మార్గంలో జరిగిన ఘటనల నేపథ్యంలో భక్తులకు పలు సూచనలు జారీ చేశారు.
తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. మోకాలిమిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన చిరుత సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. వేకువజామున సుమారు 2 గంటల ప్రాంతంలో చిరుత నడకమార్గంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ సమయంలో నడకమార్గంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో ఇదే మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో అటవీ, టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. అలిపిరి నడకమార్గం దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళుతుండటంతో తరచూ చిరుతలు, ఇతర వన్యప్రాణులు కనిపిస్తున్నాయి.












