రానున్న పురపాలక సంఘ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లెలో ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి సోమవారం మదనపల్లెలోని తన కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఆశావహులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పా రెడ్డి, పరిశీలకురాలు అనీషా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, నాయకులు దేవత సతీష్, జింకా చలపతి, షమీమ్ అస్లాం, డి. ఉదయ కుమార్, బాబ్జాన్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వార్డు స్థాయిలో పార్టీ బలాబలాలు, ప్రజా సమస్యలు, అభ్యర్థుల పట్ల ఉన్న ఆదరణపై ఎంపీ మిథున్ రెడ్డి ఆశావహులతో చర్చించారు. ప్రతి వార్డులో విజయావకాశాలను బలోపేతం చేసేలా అభ్యర్థుల ఎంపిక ఉండాలని సూచించారు.










