స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ హెచ్. కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ కె.బి. శివకుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు భరోసా కల్పించారు.
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది. నల్లగుట్టపల్లి బీసీ కాలనీ మరియు ఓబులరెడ్డిగారిపల్లె గ్రామాల్లో స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు ఈ కవాతులో పాల్గొన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల సమయంలో ప్రజలు ఎటువంటి భయం, ఆందోళన లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు భరోసా కల్పించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు.











