రైల్వే కోడూరు నియోజకవర్గంలోని నగిరిపాడు గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా సరైన రహదారి లేక అవస్థలు పడుతున్న గ్రామానికి నూతన తారు రోడ్డు అందుబాటులోకి వచ్చింది. చిట్వేల్ - కోడూరు ప్రధాన రహదారి నుంచి నగిరిపాడు గ్రామం వరకు నిర్మించిన తారు రోడ్డును గురువారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రారంభించారు.
- నిధుల కింద సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ రోడ్డును నాణ్యతతో నిర్మించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, కస్తూరి విశ్వనాథ నాయుడు, విశ్వేశ్వర నాయుడు, కాకర్ల నాగార్జున, గుత్తి నరసింహ, పంచాయతీరాజ్ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో రోడ్డు సరిగా లేకపోవడంతో అత్యవసర వైద్య సహాయం అందేందుకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, రైతులు పంటలను మార్కెట్‌కు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని గ్రామస్తులు తెలిపారు. నూతన రోడ్డుతో రాకపోకలు సులభతరం కావడంతో పాటు గ్రామాభివృద్ధికి ఊపు వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.












