ప్రారంభించిన (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 27
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో మంగళవారం 4 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా పాల్గొని పూర్తి చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం కామారెడ్డి పట్టణంలో సుమారు 4 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని జి.ఆర్. కాలనీ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా సైకిల్ ర్యాలీలో పాల్గొని, ర్యాలీని పూర్తి చేసి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు.












