జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన స్టార్ షూటర్ ఈషా సింగ్, ఆసియా క్రీడల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఐదుసార్లు షూట్ఆఫ్స్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని, స్వల్ప తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయినప్పటికీ, ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాకారులకు ఆదర్శమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి, దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.











