తిరుపతి, జులై 04
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి దేశభక్తి, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా ఆదివాసీలను సంఘటితం చేసి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఆయన దేశభక్తి, త్యాగనిరతి, ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, చూపిన పట్టుదల ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు.
అనంతరం అదనపు ఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ, ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, పోలీసు సిబ్బంది అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.












