నంద్యాల, జులై 04
పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని నంద్యాలకు చేరుకున్న రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను నేషనల్ విద్యాసంస్థల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.
పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్‌ను వారి నంద్యాల కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
నేషనల్ విద్యాసంస్థల జనరల్ సెక్రటరీ రఫీ అహ్మద్ ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్‌కు పూలమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించి, తమ ఆత్మీయతను చాటుకున్నారు. అల్లాహ్ కృపతో మంత్రి ఫరూక్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహిస్తూ ప్రజలకు మరింత విశేష సేవలందించాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.












