రాజంపేట బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సాయి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు పండిట్ దీన్ దయాళ్ ప్రతిపాదించిన అంత్యోదయ, ఏకాత్మ మానవతావాదం, జాతీయ భావజాల సిద్ధాంతాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధిలో అంత్యోదయ సిద్ధాంతం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి లోకేష్ వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధి, జాతీయ సమగ్రత, సమైక్యత ఆధారంగా జాతి పునర్నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.











