సిద్ధవటంలోని 11వ బెటాలియన్‌లో జరిగిన దీక్షాంత్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సవితమ్మను రాజంపేట మున్సిపాలిటీకి చెందిన డాక్టర్ నవీన్ కుమార్ కలిశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని ఆయన మంత్రిని కోరారు.
సిద్ధవటంలోని 11వ బెటాలియన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సవితమ్మను రాజంపేట మున్సిపాలిటీకి చెందిన డాక్టర్ నవీన్ కుమార్ ప్రత్యేకంగా కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా రాజంపేట మున్సిపాలిటీ ప్రస్తుత పరిపాలనా పరిస్థితులు, అభివృద్ధి విధానాలపై మంత్రికి వివరించారు. రాజంపేట అభివృద్ధికి తన ప్రణాళికలను మంత్రికి తెలియజేశారు.











