రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా సందులు, కాలువల శుభ్రత పనులను హడావుడిగా చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్ టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ పనులు నిత్యం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత వారం రోజులుగా సందులు, కాలువల శుభ్రత పనులు హడావుడిగా ఎందుకు చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్ టీడీపీ నేతలను ప్రశ్నించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సందులు, కాలువలను శుభ్రం చేయడం మున్సిపల్ కార్మికులు, అధికారులు నిత్యం నిర్వహించాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించలేదని అన్నారు.











