తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వకుళామాత వంటశాలలో అన్నప్రసాదాల ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గురువారం పరిశీలించారు. భక్తులకు నిరంతరాయంగా ప్రసాదాలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తిరుమలలోని వకుళామాత వంటశాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గురువారం పరిశీలించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్నప్రసాదాల ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఫుడ్ కౌంటర్లకు సకాలంలో అన్నప్రసాదాల సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.












