ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో లోక్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీసీ కార్యవర్గ సభ్యుడు అత్తింజేరి శ్రీనాథ్ సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పిలుపు మేరకు శనివారం విజయవాడ లెనిన్ సెంటర్ లో కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసీసీ ఇంచార్జ్ పీవీ మోహన్, ఏఐసీసీ కో ఇంచార్జ్ పాలక్ వేర్మ, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ తో పాటు పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని భవానీ పురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల సంఘంపై డిమాండ్లు









