మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు కడప జిల్లాలో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివానందపురం, పుట్లంపల్లె గ్రామాల్లో సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈ పర్యటన జరిగింది.
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివానందపురం గ్రామం, పుట్లంపల్లి గ్రామంలోని 6వ వార్డులో సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది రూట్ మార్చ్ నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. మునిసిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందనే సందేశాన్ని ప్రజలకు అందించారు.











